గుడ్ న్యూస్: తిరుపతి బస్సుల్లోనే శ్రీవారి దర్శనం టిక్కెట్లు... 

గుడ్ న్యూస్: తిరుపతి బస్సుల్లోనే శ్రీవారి దర్శనం టిక్కెట్లు... 

పోస్ట్ కరోనా తరువాత తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.  సమ్మర్ వస్తుండటంతో ర‌ద్దీ మరింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక దూరప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి క‌లిపి మొత్తం దాదాపుగా 650 బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డుపుతొంది ఏపీఎస్ఆర్‌టీసీ.  ఇక‌పై దూర‌ప్రాంతాల నుంచి తిరుప‌తికి వ‌చ్చే భ‌క్తుల‌కు బ‌స్సుల్లోనే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శించుకునేందుకు వెళ్లేవారి కోసం శీఘ్ర‌ద‌ర్శ‌నం టిక్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్ర‌భుత్వం.  ప్ర‌తిరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యించింది.  బ‌స్సు టిక్కెట్టుతో పాటు రూ.300 చెల్లిస్తే శీఘ్ర‌ద‌ర్శ‌నం టిక్క‌ట్టు కూడా బ‌స్సులోనే ఇస్తారు.  నిన్న‌టి నుంచి ఈ విధానం అమ‌లులోకి వ‌చ్చింది.  నిన్న‌టి రోజున 650 మంది భ‌క్తులు ఈ విధానం ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేశార‌ని ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.