తిరుమల అగ్రికల్చర్ కాలేజీ లో పులి సంచారం !

తిరుమల అగ్రికల్చర్ కాలేజీ లో పులి సంచారం !

గత కొద్ది రోజులుగా తెలంగాణలో వరుసగా పులి, చిరుత పులులు టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. పులులు, చిరుతల సంచారం జనంకు కంటిమీదకునుకులేకుండా చేస్తున్నాయి..రోజు ఎక్కడో ఒక్కచోట తారాసపడడం లేదా పశువులపై దాడులు చేస్తుండడంతో వణికిపోతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ చిరుత పులులు ఏపీని వణికిస్తున్నాయి.  తాజాగా తిరుపతి అగ్రికల్చర్‌ కాలేజీలో పులి సంచారం కలకలం రేపింది. పులి, రెండు పిల్లలు సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎటువైపు నుంచి వచ్చి ఎటాక్‌ చేస్తాయో అనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.