కొమురం భీం జిల్లాలో పులి అక్కడిదే.. పూర్తి హిస్టరీ చెప్పిన అటవీశాఖ అధికారులు !

కొమురం భీం జిల్లాలో పులి అక్కడిదే.. పూర్తి హిస్టరీ చెప్పిన అటవీశాఖ అధికారులు !

కొమురం భీం జిల్లాలో పులి కోసం అటవీ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. పులి భయానికి పత్తి చేల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు బెజ్జూర్ మండలానికి చెందిన రైతులు. అటవీ ప్రాంతాలతో పాటు పంట పొలాల వైపు సైతం ఎవరూ వెళ్లొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. అటవీ అధికారుల ఆదేశాలతో చేలోకి ఎవరూ వెళ్లడం లేదు. పత్తి అంతా చేలోనే ఉందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అటవీ ప్రాంతంలో పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి జాడ కనుక్కొనేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరాతో పులి అన్వేషణ కొనసాగుతోంది. అయితే నిన్న సులుగు పల్లి లో కనిపించిన పులి.. మేము టార్గెట్ చేసిన పులి ఒక్కటేనని సిఎఫ్  వినోద్ కుమార్ పేర్కొన్నారు. 

ఎక్కడ క్యాటిల్ కిల్ జరిగితే అక్కడికి మా టీమ్ అరగంటలోచేరుకునేలా ప్లాన్ చేసుకున్నామని అన్నారు. 62 మంది యానిమల్ ట్రాకర్స్ ఉన్నారన్న ఆయన బేస్ క్యాంప్ లో 22 మంది యానిమల్ ట్రాకర్స్, మిగతా సిబ్బంది అందుబాటులో ఉంచామని అన్నారు. పులి గురించి పూర్తిగా తెలుసుకున్నామని, గత ఆరున్నర నెలల నుంచి ఈ టైగర్ హిస్టరీ తెలుసుకున్నామని అన్నారు. మహ రాష్ట్ర స్తేషన్ లో పుట్టి పెరిగిన పులే ఇదన్న అయన అక్కడి ప్రభుత్వం పట్టుకోవడం కోసం ఆర్డర్స్ తీశారని అయితే వాళ్ళు పట్టుకునే లోపే ఆ పులి ఇటు వైపు వచ్చిందని అన్నారు. ఈ పులి జనావాసాల పరిసరాల్లో తిరుగుతుందని,  దీనికి మనుషులకి అపాయం చేసే బిహేవియర్ ఉంది.. అందుకే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.