అంబానీ మూడు కోరికలు ఇవే...

అంబానీ మూడు కోరికలు ఇవే...

భారతదేశ అపర కుభేరుడు, ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో భారత్‌ నుంచి తొలిస్థానంలో ఉన్నవాడు.. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తన లక్ష్యాన్ని వెల్లడించారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయనకు... ఏ విషయంలో మీరు గుర్తుండిపోవాలనుకుంటున్నారు అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పష్టమైన సమాధానమిచ్చారు. తన లక్ష్యంలో మూడు అంశాలున్నాయని అంబానీ తెలిపారు. మొదటిది... భారతదేశాన్ని డిజిటల్ వ్యవస్థగా మార్పు చేయడం, రెండవది... అత్యున్నత నైపుణ్యాలను కనబరిచే దిశగా దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం, ఇక మూడవది... సాంప్రదాయ ఇంధన వనరుల వాడకం నుంచి భారతదేశాన్ని రెన్యువబుల్ ఎనర్జీని వినియోగించే దిశగా మళ్లించడమన్నారు.. ఈ లక్ష్యాల సాధన దిశగా తన కృషి కొనసాగుతుందని అంబానీ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే రిలయన్స్ జియోతో విస్తృతంగా చాలా మందికి నెట్‌ను అందుబాటులోకి తెచ్చింది అంబానీయే అని చెప్పచ్చు.. అంబానీ ఎంట్రీతో టెలికం సంస్థల స్వరూపం మారిపోయింది.. ఇక, చౌకగా స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ ఫైర్‌ లాంటి వాటితో మరింత మందికి చేరువతుతోంది జియో.