దొంగ పాస్ పోర్టులతో దుబాయ్ వెళ్లేందుకు చూసిన ముగ్గురు అరెస్ట్...

దొంగ పాస్ పోర్టులతో దుబాయ్ వెళ్లేందుకు చూసిన ముగ్గురు అరెస్ట్...

దొంగ పాస్ పోర్టులతో  అడ్డదారిలో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. పోలీసులు నిర్లక్ష్యం నిఘా లోపంతో  బంగ్లాదేశీయులు చోరబడ్డారు. దేశంలోకి వచ్చి  దొంగ పాస్ పోర్టులు తయారికి ఆధార్ కార్డులు సృష్టించుకున్నారు. వీటి సాయంతో దొంగ పాస్ పోర్టులు చేయించుకోని దుబాయ్ కి వెళ్లేందుకు వచ్చి ఎయిర్ పోర్టులో పట్టుబడ్డారు. ఇమిగ్రేషన్ అధికారుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురి పై విచారణ చేపట్టారు పోలీసులు. డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పిదం జరిగిందని  గ్రహించి... శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. 

అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ లో ముగ్గురు బంగ్లాదేశీయులు పది రోజుల క్రితం నగరం నుంచి దుబాయ్ వెళ్లేందుకు వచ్చరు. వీరి పాస్ పోర్టు అధికారులకు అనుమానాస్పదం కనిపించడంతో  ఇమ్మిగ్రేషన్  వీరిని ఆర్జిఐఏ పోలీసులకు అప్పగించారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా అనేక విషయాలు బయటకు వచ్చాయి పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తులము అని చెప్పుకుని బోధన్ కొంతకాలం నివసించారు. అక్కడే ఓ ఏజెంట్ ద్వారా అక్రమ మార్గంలో ఈ సేవా ద్వారా పాస్ పోర్టులను అనుమతి కి దరఖాస్తు చేసుకున్నరు. అయితే ఇందులో ఈ సేవా నిర్వాహకుడి ప్రమేయం ఉండటంతో బోధన్ పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు.

పాస్ పోర్టు వెరిఫికేషన్ చేసేటప్పుడు సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారాని పోలీసు  విచారణలో వెల్లడయింది. ఈ కేసును బోధన్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయ్యాగా పోలీసులు వీరిని రిమాండుకు తరలించారు. ఈ కేసులో చట్టపరమైన విచారణ చేపట్టేందుకు స్థానిక, ఏఏస్ఐ.హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసారు ఉన్నతా అధికారులు. ఇదంతా ఒక ఎత్తు కానీ దేశంలోకీ  ఎంతమంది ఇలా ఇక్కడికి వచ్చారు?  ఇంకా ఎంతమంది ఇలా వెళ్లారు, దేశంలో అసాంఘిక శక్తులు చోరబడేందుకు చుస్తున్నా తరునంలో వాటిపై నిఘా పెట్టాల్సిన అవసరం పోలీసుశాఖతో పాటు ఇతర సంబంధింత శాఖల అధికారులు గట్టి నిఘా ఎర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.