ఏపీలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ బదిలీ..విశాఖ కమిషనర్ కూడా !

ఏపీలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ బదిలీ..విశాఖ కమిషనర్  కూడా !

 ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ బదిలీలు చర్చనీయంశంగా మారాయి. దానికి కారణం అందులో ఇప్పుడు కీలకంగా భావిస్తోన్న విశాఖ పోలీస్ కమిషనర్ కూడా ఉన్నారు. తాజాగా జరిగిన ఈ బదిలీల్లో డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పని చేస్తున్న  కాశి రెడ్డి వి.ఆర్.ఎన్ రెడ్డిని అడిషనల్ డిజి ఇంటెలిజెన్స్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు కూడా  కాశి రెడ్డి వి.ఆర్.ఎన్ రెడ్డి నిర్వహిస్తారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పని చేస్తున్నా రాజీవ్ కుమార్ మీనాను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ గా పనిచేస్తున్న మనీష్ కుమార్ సిన్హా ను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.