మురళీధరన్ బయోపిక్ కి మొదటి ఛాయస్ ఆ హీరోలేనా ?

మురళీధరన్ బయోపిక్ కి మొదటి ఛాయస్ ఆ హీరోలేనా ?

తమిళ ప్రేక్షకులు ఎంతో అభిమానంగా భావించే కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి. రీసెంట్ గా  శ్రీలంక క్రికెటర్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే వివాదాలకు దారితీయడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు.800 పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు. టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డుని సృష్టించిన మురళీధరన్ జీవితంలో చాలా ట్రాజెడీ ఉందని.. అది సినిమాగా తెరకెక్కించి అందరికీ తెలియజేయాలనుకున్న దర్శకుడికి సినిమా స్టార్టింగ్ లోనే  దెబ్బ పడింది. విజయ్ తప్పుకున్నప్పటికీ.. ఈ ప్రాజెక్టు అయితే ఉంటుంది అని దర్శకనిర్మాతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ’800′ కి విజయ్ సేతుపతి ఫస్ట్ ఛాయిస్ కాదట. అతని కంటే ముందే ఈ బయోపిక్ ను ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. వారిలో ఒకరు ధనుష్ అని తెలుస్తుంది. రిస్క్ అనిపించి ఆయన ముందుగానే తప్పుకున్నాడని స్పష్టమవుతుంది. ధనుష్ తరువాత ‘అసురన్’ లో అతని ‌పెద్ద కొడుకుగా నటించిన తీజయ్‌ని కూడా ఈ సినిమా కోసం సంప్రదించారట.