ఇక రూ.100 వంతు..!

ఇక రూ.100 వంతు..!

నవంబర్‌ 8వ తేదీ 2016లో డిమానిటైజేషన్‌ను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేశారు.. అయితే, వంద రూపాయల నోట్లు చెలమాణి అవుతాయని స్పష్టం చేసింది. తర్వాత కొత్త రంగు, కొలతలతో ఐదు వందల రూపాయల నోటును విడుదల చేసింది ఆర్బీఐ.. అటు తర్వాత కొత్తగా రూ.2 వేలు, రూ.2 వందల నోట్లను జారీ చేసింది. 2019లో లావెండర్‌ రంగులో కొత్త వంద రూపాయల నోటు విడుదలైంది. కానీ... పాత వంద రూపాయల నోట్ల చలామణిని కొనసాగించింది. అయితే, నకిలీల బెడద వల్ల పాత వంద నోట్లను రద్దు చేయాలని భావిస్తోంది ఆర్బీఐ.. 

మరోవైపు... పది రూపాయల నాణెంపై స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. పది రూపాయల కాసు చెలామణిలో ఉంటుందని... ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదంటోంది ఆర్బీఐ.. పది రూపాయల కాయిన్‌ చెల్లబోదనే ప్రచారం చాలా కాలంగా కొనసాగుతుండడంతో వాటిని తీసుకోడానికి జనం నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో పది రూపాయల నాణేలు పేరుకుపోయాయి. అయితే, పాత వంద రూపాయల నోట్లను మాత్రమే రద్దు చేయాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం.. యథావిథిగా తాజాగా విడుదలైన వంద రూపాయల నోట్లను మాత్రం కొనసాగిస్తుందని చెబుతున్నారు.