స్వాతంత్రం తరువాత లడఖ్ లో భారత్ అతిపెద్ద ఆపరేషన్ ఇదే...!!

స్వాతంత్రం తరువాత లడఖ్ లో భారత్ అతిపెద్ద ఆపరేషన్ ఇదే...!!

చైనా చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు.  ఏదైతే చెప్తుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయదు.  ఇది ఎన్నోమార్లు రుజువైంది. గాల్వాన్ ఘటన తరువాత రెండు దేశాల సైనికాధికారుల మధ్య అనేకమార్లు చర్చలు జరిగాయి.  ఒక్కసారి కూడా చర్చలు ఫలవంతం కాలేదు.  వెనక్కి తగ్గుతామని చెప్తూనే చైనా సైన్యాన్ని బోర్డర్ కు పంపుతున్నది.  బోర్డర్ లో అలజడి సృష్టిస్తోంది.  ఆయుధాలను వినియోగించకూడని చోట పదునైన ఆయుధాలతో  భయపెడుతున్నది. ఇక శీతాకాలంలో ఇండియాలోని ప్రాంతాలను   ఆక్రమించుకోవాలని చైనా ఎత్తుగడలు వేస్తున్నది.  

ఈ ఎత్తుగడలను ఇండియా ముందుగానే పసిగట్టి, శీతాకాలంలో చలిని సైతం లెక్క చేయకుండా సైనిక బలగాలను భారీ ఎత్తున లడఖ్ కు తరలించింది.  ఇప్పటికే లడఖ్ లోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. సైనికులు మంచును తట్టుకునే విధంగా దుస్తులను పెద్ద ఎత్తున లడఖ్ కు సరఫరా చేసింది.  వేల టన్నుల ఆహార పదార్ధాలను, మందు గుండు సామగ్రి, ఇంధనం, సైనికుల అవసరాలకు కావాల్సిన అన్ని వస్తువులను ఇప్పటికే సైనిక శిబిరాలకు చేరవేసింది.  తూర్పు లడఖ్ లోని సరిహద్దుల్లో 50వేలమంది సైనికులను ఇప్పటికే ఇండియా తరలించింది.  చలికాలం పూర్తయ్యే వరకు వీరంతా అక్కడే ఉంది పహారా కాస్తుంటారు.  సముద్రమట్టానికి ఎత్తైన ఆ ప్రాంతానికి యుద్ధ ట్యాంకులు తరలించడం అంటే మాటలు కాదు.  కానీ, ఇండియా దానిని సాధ్యం చేసి చూపించింది.  టి 90, టి 72, శతఘ్నులు వంటి వాటిని ఇప్పటికే ఆ ప్రాంతనికి తరలించింది.  మైనస్ 5 నుంచి మైనస్ 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఆ ప్రాంతంలో ఈ స్థాయిలో సైనిక బలగాలను మోహరించిన ఏకైన దేశం భారత్ అని చెప్పాలి.  చైనా ఎలాంటి దుశ్చర్యకు పాల్పడిన క్షణాల వ్యవధిలో దాడిని తిప్పికొట్టే విధంగా ఉండే అత్యాధునిక వ్యవస్థను తూర్పు లడఖ్ లో భారత్ ఏర్పాటు చేసింది.  స్వాతంత్రం వచ్చిన తరువాత భారత్ చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇదే అని చెప్పాలి.