వైరల్‌: ఈ కారు గాల్లో ఎగిరేను...

వైరల్‌: ఈ కారు గాల్లో ఎగిరేను...

కారులో నేలపైనే ప్రయాణం చేయొచ్చని ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ, గాల్లో విమానంలా ఎగిరే కారు భూమినుంచి 1,500 అడుగుల ఎత్తులో స్లోవేకియా మీదుగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని ఎయిర్‌కార్‌గా పిలుస్తున్నారు. ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. గాలిలో ఎగిరే కారును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఎయిర్‌కార్‌ను స్లోవేకియా సంస్థ క్లీన్విజన్ తయారుచేసింది. ఇటీవలే టెస్ట్‌ఫ్లైట్‌ నిర్వహించారు. కారు రన్‌వేపై వెళ్లేటప్పుడు విమానంలాగా రెక్కలు వచ్చి, ఒక్కసారిగా గాల్లోకి లేచింది. రెండు సీట్లున్న ఈ కారు మోడల్‌ బరువు 11వందల కిలోలు. 200 కిలోల అదనపు లోడ్ మోయగలదని కంపెనీ ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఈ ఎయిర్‌కార్ విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో మార్కెట్లోకి రాబోయే ఈ కారును రెండు రకాల వెర్షన్లలో విడుదల చేయనుంది సదరు సంస్థ. వీటిలో ఒకటి టూసీటర్, రెండోది ఫోర్‌ సీటర్. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంటుందట. అంటే.. ఎక్కువ సేపు స్టీరింగ్ పట్టుకోవల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇక, ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీ కోసం పారాచూట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో వాటి ద్వారా సురక్షితంగా దిగొచ్చు. విమానానికి వలెనే ఈ కారుకు ఉండే రెక్కలు రోడ్డు మీదకు కారు ల్యాండ్ అవ్వగానే ఆటోమేటిగ్గా ముడిచుకుపోతాయి.