కరోనాతో ఫ్యామిలీ అంతా హాస్పిటల్ లో..కన్నమేసిన దొంగలు

కరోనాతో ఫ్యామిలీ అంతా హాస్పిటల్ లో..కన్నమేసిన దొంగలు


 కరోనాతో కుటుంబం మొత్తం ఆస్పత్రి పాలయ్యారు. ఇదే అదునుగా భావించిన చోరిగాళ్లు ఇంటికి కన్నమేశారు. దొరికినంత దోచుకున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చి చూశాక అసలు విషయం బయటపడింది. ఈ ఘటన నగరంలోని అల్వాల్‌లో జరిగింది. అల్వాల్ సాయినగర్లో ఉంటున్న నాగవంశీకు కరోనా వచ్చింది. నాగవంశీతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యుల్ని క్వారంటైన్‌కి తరలించారు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పది తులాల బంగారు ఆభరణాలు 30 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు.