ఆ దొంగ పగబట్టాడా..బెయిల్ మీదొచ్చి అదే ఇంట్లో ?

ఆ దొంగ పగబట్టాడా..బెయిల్ మీదొచ్చి అదే ఇంట్లో ?

దొంగలు పగ బడతారా ? అనిపించేలా తెనాలిలో ఒక ఘటన జరిగింది. అదేంటంటే తెనాలిలో నిన్న జరిగిన ఒక చోరీ కేసును ఒక్క రోజులో పోలీసులు చేధించారు. అయితే ఈ చోరీ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న తెనాలి ఇస్లాం పేటలో కౌతారపు నమ్మయ్య అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. అయితే పోలీసులు 24 గంటల్లో దొంగతనం చేసిన తిరుపతయ్యని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుండి 21.50 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.  అయితే తన ఇంట్లో 2.50 లక్షల మాత్రమే చోరీ జరిగిందని నమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలు ఫిర్యాదులో తక్కువ నగదు ఎందుకు చూపాడా అని పోలీసుల విచారించగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముద్దాయి నాయుడు తిరుపతయ్య రెండు నెలల క్రితమే ఇదే ఇంట్లో 5 లక్షల చోరీకి పాల్పడ్డాడు. పోలీసులకి దొరగ్గా జైలుకు పంపారు. అయితే బెయిల్ మీద వచ్చి మరల అదే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు తిరుపతయ్య. చోరీ జరిగిన ఇంటి యాజమాని నమ్మయ్య గుట్కా వ్యాపారిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. గుట్కా వ్యాపారంలో సంపాదన కావడంతో ఫిర్యాదులో ఈ విషయం పేర్కోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దొంగ ఏమైనా ఆ ఇంటి మీద పగపట్టాడేమో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు పోలీసులు.