ఈ ఎమోజీలను ఎక్కువగా వాడుతున్నారా... జరా జాగ్రత్త... లేదంటే...
ఒకప్పుడు ఎవరికైనా మెసేజ్ చేయాలి అంటే ఇంగ్లీష్ లోనూ తెలుగులోనూ మొత్తం టైపు చేయాల్సి వచ్చేది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎమోజీలను సృష్టించారు. మొదట్లో కొన్ని ఎమోషన్స్ కు మాత్రమే ఎమోజీలు ఉండేవి. కానీ, ఇప్పుడు ప్రతి ఫీలింగ్ కు ఎమోజీ వచ్చేసింది.
హ్యాపీ ఎమోజీల కంటే విచారంతో కూడిన ఎమోజిలను యువత ఎక్కువగా వినియోగిస్తోందని సర్వేలు చెప్తున్నాయి. విషాదంతో కూడిన ఎమోజీలను ఎక్కువగా వినియోగించే వారు త్వరగా డిప్రెషన్ లోకి వెళ్తున్నారని, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని సర్వేలు చెప్తున్నాయి. ఎమోషన్స్ కు గురయ్యేవారు ఎమోజీలకు కాసింత దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)