ఆ దేశాల్లో మళ్ళీ లాక్ డౌన్... 

ఆ దేశాల్లో మళ్ళీ లాక్ డౌన్... 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.  కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లోనే కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.  సెకండ్ వేవ్ తో పాటుగా కరోనా రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ గా మారడం  అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో యూరప్ లోని అనేక దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇంగ్లాండ్ లో ఇప్పటికే ఆంక్షలు విధించారు.  జనవరితో పాటుగా ఫిబ్రవరి నెలలో కూడా ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ప్రధాని ప్రజలను కోరారు.  సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.  ఇంగ్లాండ్ తో పాటుగా జర్మనీలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది.  గతేడాది డిసెంబర్ 16 నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది.  ఈనెల 10 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.  అవసరాన్ని బట్టి లాక్ డౌన్ ను పెంచే అవకాశం ఉన్నది.  అదే విధంగా స్కాట్లాండ్ లో కూడా లాక్ డౌన్ విధించారు.  ఈ నెలాఖరు వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు స్కాట్లాండ్ ప్రధాని పేర్కొన్నారు.  నెదర్లాండ్ లో జనవరి 19 వరకు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  ఆస్ట్రియాలో జనవరి 24 వరకు లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. ఇక పోలెండ్ లో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను విధించారు.  జనవరి 17 వరకు లాక్ డౌన్ అమలు కాబోతున్నది.