మీలో ఈ మార్పులు కలుగుతుంటే... డయాబెటిస్ టెస్టు చేయించుకోండి... 

మీలో ఈ మార్పులు కలుగుతుంటే... డయాబెటిస్ టెస్టు చేయించుకోండి... 

ఒకప్పుడు డయాబెటిస్ ఎవరో కొందరికే వచ్చేది.  మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికి డయాబెటిస్ వ్యాధి వస్తున్నది.  ప్రపంచంలో అత్యధిక మంది డయాబెటిస్ తో బాధపడుతున్నట్టు  గణాంకాలు చెప్తున్నాయి.  డయాబెటిస్ ను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.  

డయాబెటిస్ సోకిన వారిలో తరచుగా దాహం వేస్తుంది.  పదేపదే యూరిన్ కు వెళ్తుంటారు.  డీహైడ్రేషన్ కలుగుతుంది. డీహైడ్రేషన్ కావడం వలన నోరు ఎప్పుడు పొడిగానే ఉంటుంది.  డయాబెటిస్ వ్యక్తుల్లో కీటోసిస్ జరుగుతుంది.  ఫలితంగా శరీరం నుంచి చెడు వాసన వస్తుంటుంది.  వేగంగా బరువు తగ్గిపోతుంటారు.  ఇది కూడా డయాబెటిస్ కు సంబంధించిన ఒక లక్షణం.  కంటిచూపు మందగిస్తుంది.  వీటితో పాటు గాయాలైతే త్వరగా మానవు.  అంతేకాదు మెడ  వెనుక భాగంలో నల్లగా మారుతుంది.  దురద, మంటలు, శరీరంలో వాపు వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటె తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది.