ఆ 12 మంది ధీరులు వీరే..

ఆ 12 మంది ధీరులు వీరే..

ఆ గుహ పొడవు పది కిలోమీటర్లు. లోపలకు ప్రవేశిస్తే తిరిగి రావడం అతి కష్టం. మరోవైపు ఎడతెరిపి లేన వర్షం.. దీని కారణంగా గుహలోకి భారీగా చేరిన వరద నీరు. ఇటువంటి ప్రతికూల పరిస్థితల మధ్య ఆ గుహలో చిక్కుకుపోయారు ఈ 12 మంది చిన్నారులు. వీరంతా 11 నుంచి 16 ఏళ్ల వయస్సుగల వారు. వీరితోపాటు చిక్కుకుపోయిన కోచ్ వయస్సు 25 ఏళ్లు. గుహను చూస్తు రెండు కిలోమీటర్లు దాటారు. ఇంతలో వర్షం వచ్చింది. గుహ లోపలకు నీరు రావడంతో వారు మూడు కిలోమీటర్ల దూరానికి వెళ్లారు. వెళ్లిన దారి మూసుకుపోయింది. ప్రాణాలతో బయటపడడం అసాధ్యమే అనుకున్న తరుణంలో ఇవాళ ఆరుగురిని రెస్క్యూ బృందం బయటకు తీసింది. మిగతా పిల్లలు కూడా క్షేమంగా బయటపడతారని సహాయక సిబ్బంది చెబుతున్నారు.10 రోజులుకు పైగా గుహలో చిక్కుకుని బాహ్య ప్రపంచానికి దూరంగా చీకటి గుహలో తిండి, తాగు నీరు లేకుండా ఈ చిన్నారులున్నారు.