రాష్ట్రంలో యూరియా కొరత లేదు- మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో యూరియా కొరత లేదు- మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదని అవసరమైన వారికి సకాలంలోనే సరఫరా చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం విడతల వారీగా యూరియా సరఫరా చేస్తోందన్నారు. ప్రతి విడతలో కొంత తక్కువ ఇస్తున్నారని చెప్పారు. కేటాయించి మొత్తం ఇవ్వాలని పలు మార్లు కేంద్రాన్నికోరినట్టు చెప్పారు. శాసన సభలో రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికల పై సభ్యులు అంజయ్యయాదవ్‌, పెద్దిసుదర్శన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సండ్ర వెంకట వీరయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఫోన్‌చేస్తే చాలు ఆరుగంటల వ్యవధిలో యూరియా అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో యూరియా కొరత ఉంటే కాల్‌ చేస్తే వెంటనే పంపుతామన్నారు. గత ఏడాదికన్నా 33.06 శాతం సాగు విస్తీర్ణం పెరిగినా ఎక్కడా యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు.