తెలకపల్లి రవి : ‘వకీల్ సాబ్' గత హీరో వరవడిలోనే వున్నారు!
మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ శుక్రవారం నాడు వెండితెరపైకి రానుంది. ఇప్పటికే ఆ చిత్రం టికెట్ల అడ్వాన్స్ భారీ స్థాయిలో అమ్మకం గురించిన కథలు రావడమే కాక అగ్రతారలు కూడా మాట్లాడుతున్నారు. పవన్ పునరాగమన చిత్రానికి ఈ రేంజిలో స్పందన వుండటం ఆశ్చర్యమేమీ కాదు. పైగా తీస్తున్నది దిల్ రాజు గనక క్రమపద్ధతిలో ప్రచారం ఎలాగూ ఉంటుంది. తన తిరిగిరాకకు ఈ చిత్రాన్ని ఎంచుకోవడం కూడా సమంజసమే. ఇవన్నీ అలా వుంచితే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా సినిమా కార్యక్రమాల్లోనూ రాజకీయ కోణం వదిలి పెట్టలేకపోతున్నారు. వకీల్‌సాబ్ లోనూ ఆ తరహా మాటలు మాట్లాడారు, వాటిలో తప్పక పరిశీలించాల్సింది ఏమంటే రాజకీయాల్లో వుంటూ సినిమాలు చేయడం. ఈ విషయంలో ఎవరూ ఆయనను తప్పు పట్టింది లేదు. కానీ ప్రతిసారి ఆ విషయం తీసుకొచ్చి సమర్థనా వ్యాఖ్యలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌తో పోలిస్తే నటులుగానూ రాజకీయ నేతలుగానూ అనేక రెట్లు సీనియర్లు ఎమ్జీఆర్, ఎన్టీఆర్. మొదట డిఎంకె నాయకుడుగానూ తర్వాత అన్నా డిఎంకె వ్యవస్థాపన అద్యక్షుడుగానూ ఎమ్జీఆర్ ఏనాడూ సినిమాలు మానింది లేదు. పైగా తన పాత్రలు తన రాజకీయ ఇమేజికి సరిపడా వుండేట్టు చూసుకునేవారు. ఆ పాత్రలు ఎప్పుడూ సిగరెట్లు కూడా తాగవు. కలులు కనవు హీరోయిన్ వెంట పడవు. అమ్మలుకు సేవ చేస్తుంటాయి. పేదలకు సహాయపడుతుంటాయి.ఇలాంటి ఉత్తమ లక్షణాలను కలిపి తీసేవారు.ముఖ్యమంత్రి అయ్యాక నటించలేదు గాని అప్పటికి పాత సినిమా రీరన్ విధానం వుండేది. ఇంకా శాటిలైట్ చానళ్లు రాలేదు.
ఎన్టిఆర్ విషయానికి వస్తే టిడిపి స్థాపించి తొమ్మిది నెల్లో అధికారంలోకి తెచ్చారని అంటుంటారు, అయితే అందులో నె నెలన్నర నా దేశం షూటింగుకు వెచ్చించారు. అంటే పార్టీ స్థాపించాకే చిత్రం తీశారన్నమాట. అంతకు ముందు కాలంలో తీసిన చిత్రాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా విడుదలవుతుండేవి. పాత్ర విషయంలో ఎమ్జీఆర్‌లా ఎన్టీఆర్ ఎలాటి నియమాలు పెట్టుకోలేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ బ్రహ్మర్షి విశ్వామిత్ర తీయడం ఒక పెద్ద ప్రయోగం. దుస్సాహసం కూడా. కళాకారుడు గనక చిత్రం తీయవచ్చని అత్యధికులు సమర్థించారు. కొందరు కోర్టుకు వెళ్లి ఆపాలని విపల యత్నం చేశారు. ఇంతా చేసి ఎన్టీఆర్ ఆ చిత్రాన్ని జనరంజకంగా తీయలేకపోయారు. విశ్వామిత్రుడి తపోభంగం కోసం వచ్చి వెళ్లే మేనక పాత్ర ఎవరు వేస్తారనే వూహాగానాలు సాగీ సాగీ మీనాక్షిశేషాద్రిని ఎన్నుకున్నారు. విశ్వామిత్రుడి కంటే రాముడు హరిశ్చంద్రుడి వంటి పాత్రలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. ఆయన ఊహించిన దానికన్నా ముందు ఎన్నికలు రావడంతో రాజకీయ ప్రచారానికి దీనివల్ల ప్రయోజనం కలగలేదు. తర్వాత ఎప్పుడో విడుదలై రెండురోజులు కూడా ఆడలేకపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ మరో నాలుగైదు చిత్రాు తీశారు. మహాకవిశ్రీనాథ,సామ్రాట్ అశోక స్వయంగా నిర్మించారు గాని అవీ పెద్దగా ఆడిరది లేదు. కాకపోతే ఆ తర్వాత మోహన్‌బాబు కోసం తీసిన మేజర్ చంద్రకాంత్ మాత్రం పాత ఎన్టీఆర్ రేంజిలో ఆడి ఆయన ప్రతిష్ట నిలబెట్టింది. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇన్ని చిత్రాలు చేయడమేమిటని ఎవరూ ఆక్షేపించిన దాఖలాల్లేవు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే మౌలికంగా ఆయన మహానటుడు.
వీరితో పోల్చదగిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించడానికి ముందు వరకూ బిజీగా నటించేవారు. ఠాగూర్ ,ఇంద్ర.స్టాలిన్ లాంటి ఆయన చిత్రాలు తీసినప్పుడే ఆయన రాజకీయాల్లోకి వస్తారని అనుకునేవారు. బాగా ఆలస్యంగా వచ్చారు కానీ రాజకీయాల్లో ఆశించినంత విజయం అందుకోలేకపోయారు. కేంద్రమంత్రిగా మాత్రం పనిచేశారు. రాజ్యసభ సబ్యత్వం ముగిసిన తర్వాత మళ్లీ ఖైదీనెంబర్150తో పున:ప్రవేశం చేశారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడమే గాక చిరంజీవి మాస్‌హీరోగా ఫామ్‌లోనే వున్నారని నిరూపించింది. తర్వాత సైరా నరసింహారెడ్డి పెట్టిన ఖర్చు తో పోలిస్తే వసూళ్లు అంత స్థాయిలో లేకున్నా కథ పరంగా నటన పరంగా మంచి పేరే తెచ్చింది. పైగా ఎన్టీఆర్ ఏ ఎన్నాఆర్ తో పోలిస్తే చిరంజీవి వయసును అధిగమించడంలో మరింత మంచి ఫలితాలు సాధించారు. బహుశా సాంకేతిక పరిజ్ఞానం పెరగడం కూడా అందుకు మరో కారణం కావచ్చు,ఇప్పుడు వరుసగా మరిన్ని చిత్రాలు నిర్మాణంలో వున్నాయి కనుక బహుశా హీరోగా మరింత కాలం కొనసాగడం తథ్యం.
మెగాసోదరులతో పోలిస్తే తమిళంలో రజనీకాంత్, కమల్‌హాసన్ కథ భిన్నంగా కనిపిస్తుంది. వారిలో ఒకరు చిత్రాలలో రాజకీయ డైలాగు చెప్పి చెప్పి ఆచరణలో రాజకీయ సన్యాసం చేశారు. మరొకరు రాజకీయ పార్టీ స్థాపించి పోటీ పడుతున్నా సినిమా మానేస్తున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు.ఇప్పుడు మళయాలంలో కన్నడంలో కూడా హీరోలు కొందరు రాజకీయాల్లో ప్రవేశించినా నటన మానిందిలేదు. కనుక పవన్ కళ్యాణ్ ఆ ప్రస్తావన చేయవలసిన అవసరం కూడా పెద్దగా లేదు. ఆయన ఆదాయం కోసం తనకున్న మార్గం ఇదేనని బాహాటంగా ప్రకటించారు గనక వరుసగా ఒప్పుకుంటున్న చిత్రాలు చేసుకుంటూ పోవచ్చు. రాజకీయాలకు సినిమా గ్లామర్ కూడా తోడు కావచ్చు గాని దేనికి అదిగా చూడగలిగిన పరిణతి, ఇప్పుడు వరుసగా మరిన్ని చిత్రాలు నిర్మాణంలో వున్నాయి కనుక బహుశా హీరోగా మరింత కాం కొనసాగడం తథ్యం. ప్రజకు ఉంటుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)