‘ఆకాశ‌వాణి’ టీజ‌ర్ విడుదల చేసిన రాజమౌళి

‘ఆకాశ‌వాణి’ టీజ‌ర్ విడుదల చేసిన రాజమౌళి

సముద్ర‌ఖ‌ని, విన‌య్ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘ఆకాశ‌వాణి’. అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి ఆవిష్క‌రించారు. అడవిలో జీవించే ఆదివాసీలు కళ్లాకపటం తెలియని పిల్లలు రాత్రివేళ కాగడలతో అన్వేషణ అందరూ దేన్నో చూసి భయభ్రాంతులకు గురవుతుండటం వంటి అంశాలను ఈ టీజర్ లో చూపించారు. కాగా టీజర్ ప్రారంభం నుంచి సంభాషణలు లేకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ‏తోనే నడిచింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.