రోజు 137 మంది మహిళలు హత్య 

రోజు 137 మంది మహిళలు హత్య 

ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా సరాసరి 137మంది మహిళలు హత్యకు గురవుతున్నారు. ఈ హత్యలు చేస్తోంది ఎవరో కాదు జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులే. ఈ మేరకు యునైటెట్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓడీసీ) కొత్త లెక్కలను విడుదల చేసింది. ఈ హత్యల్లో ఎక్కువగా భాగం ఇళ్లలోనే జరుగుతున్నాయని ప్రకటించింది. హత్యకు గురైన వారిలో సగానికిపైగా మహిళలు వారితో దగ్గరి సంబంధం ఉన్న వారి చేతుల్లోనే అని స్పష్టం అవుతోంది.  ఇప్పటి వరకు నమోదై సంఖలో ఎక్కువగా 2017లో 87,000 మంది చనిపోయారు. అందులో సుమారు 30,000 మంది మహిళలు జీవిత భాగస్వామి చేతినలో హత్య ప్రాణాలు కోల్పోయారు. మరో 20,000 మంది వారి బంధువుల చేతిలో చనిపోయారని యూఎన్ఓడీసీ ప్రకటించింది.