భారత గెలుపులో ద్రవిడ్ ముఖ్య పాత్ర...

భారత గెలుపులో ద్రవిడ్ ముఖ్య పాత్ర...

ఐపీఎల్ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన చేసి టెస్ట్ సిరీస్ సొంతం చేసుకుంది టీ ఇండియా. అయితే భారత జట్టు ఈ విజయం సొంత చేసుకోవడం వెనుక ఓ వ్యక్తి కష్టం ఉంది. ఆయనే ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ టీమిండియాకు ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిస్తున్నారు. బ్రిస్బేన్ మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే.. అందుకు ముఖ్య కారణం శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి యువ ఆటగాళ్లు. అయితే వీరంతా ద్రవిడ్ పర్యవేక్షణలోనే ఆడినవారే. అండర్-19, భారత్-ఏ కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. ఈ యువ ఆటగాళ్లకు తన విలువైన సలహాలిస్తూ మార్గనిర్దేశనం చేశాడు. అయితే ద్రావిడ్ కష్టానికి దక్కిన ఫలితమే ఈ గబ్బా విజయం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరూ అభిమానులు ట్విటర్‌ వేదికగా రాహుల్‌ ద్రవిడ్‌కు అభినందనలు చెబుతున్నారు.