పోంపియో విధానం విఫలమయింది

పోంపియో విధానం విఫలమయింది

టెహ్రాన్: మైక్ పోంపియో విధానం విఫలమైందని ఇరాన్ విదేశాంగ శాఖ చురకలేసింది. అయితే ఈ విషయాన్ని మొదటగా పోంపియోనే అన్నారు. ఇరాన్‌పై తన మాగ్జిమం ప్రెజర్ విధానం విఫలమయిందని పోంపియో తెలిపారు. దాంతో దానిపై ఇరాన్ విదేశాంగ అధికారి సయీద్ ఖతీబ్‌జాదే స్పందిచారు. ‘ పోంపియో బాధను అర్థం చేసుకోగలను. అతడు నమ్మిన విదానం అంతలా విఫలమైనందుకు అతడికి ఉండే కొపానికి అర్థం ఉంది. కానీ అతడి మ్యాగ్జిమం ప్రెజర్ విధానం కాస్తా మ్యాగ్జిమం ఫ్లాప్ అయింద’ని అన్నారు. అయితే పోంపియో తన సమావేశంలో అమెరికాలోని మ్యాగ్జిమం ప్రెజర్ విధానం బాగానే నడుస్తోందని, ఇంకొన్నాళ్లు అలానే ఉంటోంని అన్నారు. ఈ విధానం ఇరాన్‌పై కూడా ప్రభావం చూపుతుందని, అది దేశంలో విరాళాలతో నడిచే అనధికార పనులను అరికడుతుందన్నారు. ఎప్పుడైనా ఈ ఒత్తిడి తగ్గితే దేశానికి ఎంతో హాని కలుగుతుందని పోంపియో తెలిపారు. అయితే యూఎస్‌లో ట్రంప్ ఓటమితో ఇరాన్, యూఎస్‌ల మధ్య ఉన్నా ఒప్పందాలను ముగిస్తున్నాయి. 2018లో జరిగిన జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి కూడా తప్పుకున్నాయి. ప్రస్తుతం టెహ్రాన్‌లోని న్యూక్టియర్ ప్రోగ్రామ్ గురించి టెహ్రాన్ సహా మరో ఆరు అంతర్జాతీయలుతో కలిసి 2015లో ఓ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్‌కు కావలసిన ఆయుధాలను అందిస్తామన్నారు. అదికూడా కేవలం యూఎన్ సెక్యూరిటీ పర్మెషన్ కావాలని ఒప్పందం చేసుకున్నారు.