మద్యం కోసం పేగు బంధాన్ని తెంచుకున్న కసాయి తల్లి..!

మద్యం కోసం పేగు బంధాన్ని తెంచుకున్న కసాయి తల్లి..!

మద్యం డబ్బుల కోసం ఓ కసాయి తల్లి తన పేగు బంధాన్నే తెంచుకుంది. మత్తుకు బానిసై బంగారం లాంటి చంటిబిడ్డను అమ్ముకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఎంఎస్‌ మక్తాకు చెందిన అబ్దుల్‌ ముజాహిద్‌(29), షేక్‌ జోహాఖాన్‌(22) దంపతులు సుభాన్‌పురాలో నివాసం ఉంటున్నారు. కాగా జోహాఖాన్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరికీ గొడవలు జరిగేవి. అయితే ఈనెల 3న ముజాహిద్‌ బంధువుల ఇంటికి వెళ్లాడు. అతడు బంధువుల ఇంటినుండి తిరిగి వచ్చేసరికి తన భార్య జోహాఖాన్ బిడ్డను సుభాన్‌పురాకు చెందిన షేక్‌ మహమ్మద్‌(30), తబస్సుం (25)లకు రూ.45వేలకు అమ్మేసింది. భర్త ఇంటికి వచ్చాక నిలదీసేసరికి విషయం భయట పడింది. దాంతో అతడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. దాంతో పోలీసులు విచారణ జరిపి బాబును తండ్రికి అప్పగించారు. తల్లికి కౌన్సిలింగ్ ఇప్పించారు.