ప్రియుడి మోజులో ప‌డిపోయింది.. క‌న్న‌బిడ్డ‌ను వ‌దిలేసి వెళ్లిపోయింది..!

ప్రియుడి మోజులో ప‌డిపోయింది.. క‌న్న‌బిడ్డ‌ను వ‌దిలేసి వెళ్లిపోయింది..!

ఏపీలో చేప‌ట్టిన ఆపరేషన్ ముస్కాన్ ఎంతో మంది చిన్నారుల‌ను కాపాడుతోంది.. ఆపరేషన్‌ ముస్కాన్‌ సత్ఫలితాలు ఇస్తూ.. ఎంతోమంది చిన్నారుల‌ను త‌మ త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రకు చేరుస్తోంది.. తాజాగా.. వెలుగుచూసిన ఓ క‌థ‌లో త‌న సుఖం కోసం ఏడేళ్ల క‌న్న‌కూతురిని వ‌దిలేసివెళ్లిపోయింది త‌ల్లి.. అక్రమ సంబంధం మోజులో పడిన‌ ఆ త‌ల్లి.. కన్నబిడ్డని కూడా చూడ‌కుండా వదిలేసి.. ప్రియుడితో క‌లిసి చెక్కేసింది.. రెండు మూడు రోజుల్లో తిరిగివ‌స్తానంటూ చెప్పి.. త‌న త‌ల్లి వెళ్లిపోవ‌డంతో... ఆశ‌గా ఎదురుచూస్తున్న ఆ చిన్నారికి నిరాశే మిగిలింది.. చివ‌ర‌కు ఆప‌రేష‌న్ ముస్కాన్‌లో ఆ చిన్నారిని చైల్డ్‌ హోమ్‌కు తరలించారు పోలీసులు.. 

వివ‌రాల్లోకి వెళ్తే.. బిందు అనే ఏడేళ్ల అమ్మాయిని వ‌దిలి వెళ్లిపోయింది త‌ల్లి... ఆరు నెల‌ల‌ల క్రితం.. తల్లి నిహారిక, ప్రసాద్ అనే వ్య‌క్తితో క‌లిసి హైదరాబాద్ నుండి గుంటూరుకి వ‌చ్చి ప‌నికి కుదిరారు.. ఒక ఇంట్లో ప్రసాద్ వాచ్‌మెన్‌గా చేర‌గా.. అదే ఇంట్లో పనిమనిషిగా చేరింది నిహారిక‌.. అయితే.. వారి నివాసం ప‌క్క‌నే ఉండే.. ముసులూరి కుమారిని అక్క అంటూ పిలుస్తూ ద‌గ్గ‌ర‌య్యారు. కేవలం 10 రోజులు గడిచిన త‌ర్వాత‌.. ప్రసాద్, నిహారిక ఇద్ద‌రు క‌లిసి.. వెళ్లిపోయారు.. వెళ్లేముందు.. మా అమ్మాయిని మీ ద‌గ్గ‌ర ఉంచుతాం.. హైదరాబాద్ వెళ్లి రెండు మూడు రోజుల్లో తిరిగి వ‌స్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు.. ఇదంతా ఓ ప్లాన్ ప్ర‌కార‌మే చేసిన‌ట్టుగా తెలుస్తోంది.. ఆ చిన్నారి తండ్రి ఏమ‌య్యాడు కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి.. క‌న్న కూతురుని కూడా ఇలా వ‌దిలించుకొని వెళ్లిపోయింది ఆ మ‌హిళ‌.. ఇక‌, ఆరు నెలలు గడిచినా తిరిగిరాక‌పోవ‌డంతో.. కుమారికి ఆ చిన్నారిని పోషించ‌డం భారంగా మారింది.. ఆరోగ్యం బాగా లేక చికిత్స పొందుతూ,  తానే కష్టంగా బ‌తుకుతోన్న సమయంలో.. ఆప‌రేష‌న్ ముస్కాన్ గురించి తెలిసి.. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది.. దీంతో.. ముస్కాన్ ఆపరేషన్ టీం ఆ చిన్నారిని రిస్క్యూ హోమ్‌కి తరలించారు. ఎస్పీ అమ్మిరెడ్డి ఆ చిన్నారితో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు. ముస్కాన్ టీమ్‌ను అభినందించారు.