రివ్యూ: ది లయన్ కింగ్

రివ్యూ: ది లయన్ కింగ్

మ్యూజిక్: హన్స్ జిమ్మర్ 

సినిమాటోగ్రఫీ: కెలాబ్ డిశ్చానల్

నిర్మాణం: డిస్ని 

దర్శకత్వం: జాన్‌ ఫెవ్‌రూ

1994 వ సంవత్సరంలో డిస్ని నుంచి ది లయన్ కింగ్ సినిమా వచ్చింది.  ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.  పూర్తిస్థాయి యానిమేటెడ్ సినిమాగా వచ్చిన ఆ సినిమాను ఇప్పుడు రీమేక్ చేసి విజువల్ వండర్ గ తీర్చి దిద్దారు.  ఈ మూవీ ఇప్పటికే పలు దేశాల్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.  ఇండియాలో రేపు రిలీజ్ కాబోతున్నది.  కానీ, ఇప్పటికే ప్రత్యేక షో వేయడంతో రివ్యూ బయటకు వచ్చింది.  మరి డిస్ని నుంచి వచ్చిన ఆ దృశ్యకావ్యం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.  

కథ: 

కథను చందమామ కథలా మొదలు పెడితేనే బాగుంటుంది. అనగనగా ఓ అడవి.  ఆ అడవికి ముసాఫా అనే సింహం రాజుగా ఉంటాడు.  అతని పాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది.  ముసాఫాకు సింబా అనే బుల్లి సింహం పుడుతుంది.  ఈ బుల్లి సింహాన్ని రాజ్యానికి కాబోయే రాజుగా ప్రకటిస్తారు.  ఇది ముసాఫా తమ్ముడు స్కార్ కు నచ్చదు.  ఎలాగైనా అన్నా, అతని కొడుకు సింబా ను అడ్డు తొలగించి రాజు కావాలని అనుకుంటాడు.  స్కార్ అనుకున్నది సాదించాడా ? సింబా అడవికి రాజు అయ్యాడా లేదా అన్నది మిగతా కథ.  చందమామ కథలా చాలా చక్కగా ఉంది కదా.  

విశ్లేషణ: 

1994లో వచ్చిన సినిమానే కాబట్టి కథ అందరికి తెలిసిందే.  కాకపోతే విజువల్ వండర్ గా సినిమాను తెరకెక్కించారు.  ఫోటో రియలిస్టిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో సినిమా రియల్ గా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫ్రేమ్ లో కనిపించే ప్రతి ఒక్కటి రియల్ గా ఉన్నట్టే కనిపిస్తుంది.  దీంతో ప్రేక్షకుడు ఆ అడవిలోకి వెళ్లిన ఫీలింగ్ కనిపిస్తుంది.  పైగా 3డి సినిమా కావడంతో ఆ ఫీల్ ను బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.  

ముసాఫా తన కొడుకు సింబాకు యువరాజుగా ట్రైనింగ్ ఇచ్చే విధానం ఆకట్టుకుంటుంది.  యువరాజు సింబా దూకుడుతో రాజు ముసఫా ఇబ్బందుల్లో పడతాడు.  అదే అదునుగా భావించిన స్కార్ ముసాఫాను అడ్డు తొలగించుకుంటాడు.  చిన్నారి సింబాను అడవినుంచి గెంటేస్తాడు.  ఈ సీన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి.  ఎమోషనల్ గా ఈ సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి.  వేరే అడవికి వెళ్లిన సింబాను పుంబా, టిమోన్ ను పెంచి పెద్ద చేస్తాయి.  వారి సంరక్షణలో సింబా అన్ని విషయాలు నేర్చుకుంటాడు.  అదే సమయంలో నల అనే ఆడ సింహం ద్వారా తన తల్లి, తన రాజ్యం ఎదుర్కొంటున్న బాధలు, సమస్యల గురించి తెలుసుకున్న సింబ ఆ రాజ్యానికి వెళ్లి చిన్నాన్న స్కార్ ను ఎదిరిస్తాడు.  ఈ సీన్స్ చాలా ఎమోషల్ గా ఉంటాయి.  క్లైమాక్స్ హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుంది.  

తెలుగులో ముసాఫా పాత్రకు రవిశంకర్, సింబ పాత్రకు నాని, స్కార్ పాత్రకు జగపతి బాబు, పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్ పాత్రకు ఆలీ డబ్బింగ్ చెప్పడంతో ఇది తెలుగు సినిమాలా అనిపిస్తుంది తప్పించి డబ్బింగ్ సినిమా అనిపించదు.  ఇది సినిమాకు ప్లస్ అయ్యింది.  దర్శకుడు జాన్‌ ఫెవ్‌రూ సినిమాను తీర్చిదిద్దిన తీరు మెచ్చుకోదగిందనే చెప్పాలి.  దాదాపు 260 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి దానికి తగ్గట్టుగానే ఉన్నది.  

చివరిగా: ది లయన్ కింగ్ - ఎమోషనల్ గా సాగే విజువల్ వండర్