అడిలైడ్ టెస్ట్: ఆసీస్ 191/7

అడిలైడ్ టెస్ట్: ఆసీస్ 191/7

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ జట్టు పట్టుబిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ, జప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు చేరారు. మొదటి ఓవర్లోనే ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా, హారీస్(26), ఖ్వాజా(28), షాన్ మార్ష్(2), పీటర్ హాండ్స్కాంబ్(34), టిమ్ పైన్(5), కమిన్స్‌(10) పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్( 61 పరుగులు, 149 బంతుల్లో.. 6 ఫోర్లు), మిచెల్ స్టార్క్ (8 పరుగులు, 17 బంతుల్లో ఒక ఫోర్ ) క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 59 పరుగుల వెనకంజలో ఉంది.