కాంగ్రెస్ జీవితంలో అధికారంలోకి రాదు : తలసాని

కాంగ్రెస్ జీవితంలో అధికారంలోకి రాదు : తలసాని

కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు కురిపించారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు డ్రామా చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో ఇళ్ళు కట్టడం పెద్ద టాస్క్ అని వ్యాఖ్యానించారు. తాము డబుల్ బెడ్ రూమ్ ఉందని చెప్పింది ఒక చోట...కానీ భట్టి పోయి చూసేది మరోచోట అని అన్నారు. లక్ష ఇళ్ళు ఉన్నాయి...ఓపెన్ గా మాట్లాడడానికి సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ నేతల సర్టిఫికెట్ లు అవసరం లేదని..45 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భట్టి ని దగ్గరకు కూడా రానివ్వలేదని ఎద్దేవా చేసారు. పబ్లిసిటీ కావాలంటే తెలివి తేటలు ఉండాలని అన్నారు.  హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి 150 డివిజన్లలో అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికయినా బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ జీవితంలో అధికారంలోకి రాదని అన్నారు. సుమేధ మృతి ఘటనపై స్పందించిన తలసాని. ప్రజలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పు జరిగింది వాస్తవమని సుమేధా తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతున్నాం ...వారి బాధను తీర్చలేమని వ్యాఖ్యానించారు. సుమేధ మృతి చాలా బాధాకరమని అన్నారు. నాళాలు ఎప్పటి నుంచో ఉన్న దరిద్రమన్నారు.