రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత...బాబుకు నోటీసులు.. 

రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత...బాబుకు నోటీసులు.. 

చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది.  బాబు చిత్తూరులో పర్యటించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.  ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బాబును పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.  ఎయిర్ పోర్టులోనే బాబుకు నోటీసులు ఇచ్చారు.  కరోనా నిబంధనలు, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఎలాంటి ధర్నాలు, దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిరసనలు తెలియజేసింది. చిత్తూరులో దీక్ష, తిరుపతిలో ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.