గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు...కాకులపాడులో ఉద్రిక్తత... 

గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు...కాకులపాడులో ఉద్రిక్తత... 

గన్నవరం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.  గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వంశి ఆ తరువాత వైసీపీకి జైకొట్టిన సంగతి తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వంశి వైసీపీతో కలిసి పనిచేయడం ఆ పార్టీలో చాలామందికి రుచించడం లేదు.  దీంతో గన్నవరం వైసీపీలో విభేదాలు, గ్రూపు తగాదాలు మొదలయ్యాయి.  నిన్నటి వరకు అవి నివురుగప్పిన నిప్పులా ఉండగా, ఈరోజు రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సమయంలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  గన్నవరం నియోజక వర్గంలోని బావులపాడు మండలం, కాకులపాడులో రైతుభరోసా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన జరిగింది.  

శంకుస్థాపన కార్యక్రమాన్ని తాము చేస్తామని ఎమ్మెల్యే వంశీ వర్గీయులు, దుట్టా వర్గీయులు పోటీ పడ్డారు.  ఎమ్మెల్యే వంశి ముందే ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.  ఒక దశలో రాళ్లు రువ్వుకోవడంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది.  దాదాపుగా  మూడు గంటలకు నియోజక వర్గంలో హైడ్రామా నడిచింది. ఇక దండిగుంట్లలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీలను దుట్టా వర్గీయులు చించేయడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులను భారీగా మోహరించారు.