బిగ్ బాస్ : గంగవ్వను పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారా ..?

బిగ్ బాస్ : గంగవ్వను పరోక్షంగా టార్గెట్  చేస్తున్నారా ..?

బిగ్ బాస్ లో స్పెషల్ కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన గంగవ్వ రెండో వారం కూడా నామినేట్ అయింది. మొదటివారం నామినేట్ అయిన గంగవ్వ ప్రేక్షకుల ఆదరణతో సేవ్ అయ్యింది. ఇక గంగవ్వ బిగ్ బాస్ కు వెళ్ళకముందునుంచే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చూడని వాళ్ళుకూడా గంగవ్వ కోసం బిగ్ బాస్ చూస్తున్నారు . గంగవ్వను ఎలాగైనా బయటకు పంపించాలని కొందరు సభ్యులు ఆలోచిస్తున్నారట. ఆమెకు బయట ఫుల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎన్నిసార్లు నామినేట్ చేసినా సేవ్ అవుతోంది.. దాంతో ఆమెను ఒంటరిని చేస్తే ఆమె సెల్ఫ్ ఎలిమినేట్ అవుతుందని కొందరు ఇంటిసభ్యులు బావిస్తున్నారని తెలుస్తుంది. గంగవ్వ హౌస్లో ఉండలేకపోతోంది. "నేను ఉండలేను బిడ్డ నేను పోతా" అని పలుసార్లు గంగవ్వ అనడం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇంటిసభ్యులు పైకి అందరూ గంగవ్వతో బాగానే ఉన్నట్టు నటిస్తున్నప్పటికీ ఆమెను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. పల్లెటూరి అమాయకత్వం, కల్లాకపటం లేని గంగవ్వ హౌస్ లో మిగిలినవాళ్లలానటించకుండా కాకుండా సహజంగా ఉంటుంది. దాంతో ఆమెకు ప్రేక్షకులనుంచి విపరీతమైన అభిమానం లభిస్తుంది .గతంలో కూడా ఇలానే సంపూర్ణేష్ బాబు విషయంలో జరిగింది. అతడు కూడా హౌస్ లో ఒంటరి అవ్వడంతో తట్టుకోలేక బిగ్ బాస్ తో గొడవ పెట్టుకొని మరీ వెళ్ళిపోయాడు, ఇప్పుడు గంగవ్వ విషయం లోనూ అదే జరుగుతుందేమో అని ఆమె అభిమానులు కలవరపడుతున్నారు .