ఖమ్మం రైతు బజార్ మూసివేత..ముట్టడించిన రైతులు, ప్రతిపక్షాలు

ఖమ్మం రైతు బజార్ మూసివేత..ముట్టడించిన రైతులు, ప్రతిపక్షాలు

ఖమ్మం నగరంలో మొదటి నుంచి ఉన్న రైతు బజార్ ను మూసి వేశారు. గ్రామాల నుంచి రైతులు వచ్చి తక్కువ ధరలకు కూరగాయలను విక్రయాలు చేస్తున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి ఉన్న రైతు బజార్ ను కరోనా సమయంలో మూసి వేసి, ఆ తరువాత శాశ్వతంగా మూసి వేశారు. అయితే అక్కడే ఉండే వీధి వ్యాపారస్తుల కోసం ప్రత్యేక మార్కెట్ ను రైతు బజార్ మార్కెట్ కు సమీపంలో నిర్మించారు. దీంతో ఆ వీధివ్యాపారస్తుల కోసం ఈ రైతు బజార్ ను మూసి వేశారని ప్రచారం జరుగుతుంది. నిన్న రైతు బజార్ లోకి రైతులు బలవంతంగా వెళ్లి వ్యాపారాలు చేసుకోగా, గత రాత్రి దానిని మూసి వేయించారు.

ఈరోజు ఉదయం నుంచి బారీ ఎత్తున పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి మార్కెట్ కు క్యాప్చర్ చేసుకున్నారు. దీంతో రైతు బజార్ లోకి బిజెపి నాయకత్వాన వచ్చిన కార్యకర్తలు రైతు బజార్ లోకి దూసుకుని వెళ్లారు. కాంగ్రెస్, న్యూడెమాక్రసి, సిపిఎం, టిడిపి కార్యకర్తలు కూడ మద్దతు పలికారు. మార్కెట్ గేట్ల తాళాలను రాళ్లతో పగుల గొట్టారు. లోపలికి రైతులు దూసుకుని వెళ్లడంతో సిఐ గోపీ కూడ గేట్లు దూకి లోపలికి వెళ్లారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ సైతం గేటు దూకి రైతు బజార్ లోకి వెళ్లారు.