అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

అమెరికాలో ఓ తెలుగు యువతి దుర్మరణం చెందింది. కృష్ణ జిల్లాకు చెందిన కమల ప్రమాదవశాత్తు ఓ జలపాతంలో పడి మరణించింది. గుడ్లవల్లేరుకు చెందిన లక్ష్మణ్ రావు-అరుణ దంపతుల రెండో కుమార్తె అయిన కమల ఎంఎస్ పూర్తిచేసి అమెరికాలో ఉంద్యోగం చేస్తుంది. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్న ఆమె అక్కడి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగివస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగింది. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో అందులో పడి మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న కమల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ప్రస్తుతం కమల మృతదేహాన్ని భారత్ కు తీసుకరావడానికి ప్రయత్నం చేస్తున్నారు.