ఎస్పీ బాలు మృతికి సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు...

ఎస్పీ బాలు మృతికి సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు...

సింగింగ్ లెజెండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సంగీత లోకం మూగబోయింది. ఈయన మరణంపట్ల సినీ ఇండస్ట్రీ మొత్తం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఇక ఎస్పీ బాలు మృతికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. ''గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదిక తెలిపారు. ఇక తెలంగాణ సీఎం ఆఫీస్ ''సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన శ్రీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు.'' అంటూ తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.