'తెలుగుదేశం పార్టీ @ 125 ప్లస్..!'

'తెలుగుదేశం పార్టీ @ 125 ప్లస్..!'

పని చేసే ప్రభుత్వానికి ప్రజలు తిరిగి పట్టంకట్టబోతున్నారు... ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 125కు పైగా స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు... విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలింగ్ రోజు ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనం అన్నారు. ఏర్పాట్లలో లోపాలపై స్వయంగా ఎన్నికల కమిషనర్ ఒప్పుకున్నారన్న గంటా.. భద్రత ఇవ్వలేకపోయం, ఓట్లుగల్లంతు నిజమేనని సీఈవో ద్వివేది అన్నారని గుర్తు చేశారు. 20 నుంచి 30  శాతం వరకు ఈవీఎంలు ప్రారంభంలో పనిచేయలేదని.. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 37 వార్డు 209 బూత్ లో అర్ధరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అన్నారు. మా పోరాటం ఎలక్షన్ కమిషన్ నిర్వాహణలోపంపైనేనని స్పష్టం చేసిన గంటా... మరి ఎక్కడా ఇలాంటి పొరపాట్లు జరగకూడదు.. ప్రజలు, ఓటర్లు ఇబ్బంది పడకూడదనే మా పోరాటం అన్నారు. ఇక అన్నివ్యవస్ధలను మేనేజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ ను కూడా మేనేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.