టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి జయసుధ..!

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి జయసుధ..!

సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి సహజనటి జయసుధ గుడ్‌బై చెప్పారు... ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్న ఆమె... జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడనాకి సిద్ధమయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయసుధ... ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారే విజయం సాధించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఆమె విజయం సాధించి... రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఆమె... అనంతరం టీడీపీలో చేరారు. కానీ, కొన్ని పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన సహజనటి.. ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.