రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు...

రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు...

తెలంగాణ మరియు దానిని అనుకోని ఉన్న దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న  అల్పపీడనం ఈరోజు ఉదయం బలహీనపడింది. దీనికి అనుబంధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km ఎత్తు వరకు కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. తూర్పు-పశ్చిమ shear zone Lat.15.0 deg.N వెంబడి 3.6 km నుండి 5.8 km ఎత్తు మధ్య కొనసాగుతోంది.

ఇక ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో రాగల మూడురోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. 

ఆదిలాబాద్, కోమురంభీం –ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.