కేటీఆర్ మాటలు ఆస్కార్ అవార్డును దాటిపోతున్నాయి

కేటీఆర్ మాటలు ఆస్కార్ అవార్డును దాటిపోతున్నాయి

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మాటలు ఆస్కార్ అవార్డును దాటిపోతున్నాయని టీడీపీ నేత శోభారాణి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శోభారాణి మాట్లాడుతూ నిన్న కేటీఆర్ యాదాద్రిలో మహాకూటమిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేనట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు. పొత్తులు లేకుండా టీఆర్ఎస్ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. 105 నియోజక వర్గాల్లో 100 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారన్నారు. బావ.. బావ మరుదులు పోటీపడి చంద్రబాబును దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణా ప్రజలకు గడి కావాలా.. గుడి కావాలా అని అడిగారు. టీఆర్ఎస్ లో వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక టీఆర్ఎస్ పప్పులు ఉడకవు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఇక్కడ టీడీపీ బ్రతకాల్సిందే అని శోభారాణి అన్నారు.