ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తి

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తి

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి అయింది.  ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగిసింది.  మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 60కి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.   ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానానికి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.  రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది.  ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఇక మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు అధికారులు.