రైతులు బోర్ల వేసిన‌ సొమ్ముతో రెండు ఎస్సారెస్పీ ప్రాజెక్టులు క‌ట్టొచ్చు..!

రైతులు బోర్ల వేసిన‌ సొమ్ముతో రెండు ఎస్సారెస్పీ ప్రాజెక్టులు క‌ట్టొచ్చు..!

రైతును సంఘటితం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి.. సీఎం ఆదేశం మేరకు క్లస్టర్ లలో రైతు వేదిక భవనాలకు శంకుస్థాపనలు చేశామ‌న్న ఆయ‌న‌.. నా సొంత గ్రామం వేల్పూర్ లో నా తండ్రి పేరు మీద సొంత డబ్బులతో రైతు వేదిక భవన నిర్మాణం చేపడుతున్నామ‌ని వెల్ల‌డించారు.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడితున్నారు... రెండేళ్ల కాలoలో రూ.22 వేల కోట్లతో రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టార‌ని వెల్ల‌డించారు.. ఎలాంటి సమస్యలు లేకుండా నాణ్యమైన కరెంట్ ను రాష్ట్రంలో అందిస్తున్నాం.. తెలంగాణ రైతు బాధ తెలిసిన కేసీఆర్.. సాగు నీటి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాని తెలిపారు. ఇక‌, రాష్ట్రంలో బోర్లు వేయ‌డం కోసం రైతులు రూ. 40 వేల కోట్లు ఖర్చుచేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి.. ఆ డబ్బులతో రెండు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లు క‌ట్టొచ్చు అని వ్యాఖ్యానించారు. రైతులకు సాగు నీటి కష్టాలు రాకుండా సాగు నీటి కార్యక్రమాలు చేప‌ట్టిన వ్య‌క్తి సీఎం కేసీఆర్ అని.. రూ. 4 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాంల నిర్మాణం జ‌రుగుతోంది.. రైతు ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండాలన్నదే మా లక్ష్యం అన్నారు.