ప్రకాష్‌ జవదేకర్‌ను కలిసిన కేటీఆర్...

ప్రకాష్‌ జవదేకర్‌ను కలిసిన కేటీఆర్...

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్... కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో సమావేశమయ్యారు... కేటీఆర్‌తో పాటు ఎంపీ వినోద్‌ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్రంలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జవదేకర్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్... గత మూడేళ్లుగా కరీంనగర్ లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు ఎంపీ వినోద్ శ్రమిస్తున్నారని తెలిపారు. గతంలో ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి అందిచామని... ఉత్తర తెలంగాణలో విద్యా అవకాశాలు మెరుగుపడేలా కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీకోసం సీఎం కేసీఆర్... ప్రధాని మోదీ, మంత్రి జవదేకర్‌కు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్... కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరోసారి మా డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచామన్నారు.