అమిత్‌షాకు కేటీఆర్ కౌంటర్..

అమిత్‌షాకు కేటీఆర్ కౌంటర్..

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన కామెంట్లుకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్... సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రత్యేక విమానాల్లో ఉత్త చేతులతో వస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు.. హైదరాబాద్‌కు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ రద్దు చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని గుర్తుచేసిన కేటీఆర్... ఐటీఐఆర్‌ను రద్దు చేసింది కాకుండా.. ఇప్పడు హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్ చేస్తాం అంటూ అమిత్‌షా చెబుతున్న మాటలను ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. మాది నిజాం సంస్కృతి కాదు... హైదరాబాద్‌.. గంగ జామున తహజీబ్ అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ.. ఆయన మాటలను గుర్తు తెచ్చుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక, హైదరాబాద్‌కు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు.. బిర్యానీ తిని... ఇరానీ చాయ్ తాగి వెళ్ళండి అంటూ సెటైర్లు వేసిన కేటీఆర్.. ఈసీకి లేఖరాసి వరద సాయం ఆపింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే 6.64 లక్షల కుటుంబాలకు వరద సాయం అందించాం.. డిసెంబర్ 4వ తేదీ తర్వాత మిగతా బాధితులకు కూడా వరదసాయం అందిస్తామని స్పష్టం చేశారు.