టెక్స్టైల్ శాఖ పై కేటీఆర్ సమీక్ష సమావేశం.!

 టెక్స్టైల్ శాఖ పై కేటీఆర్ సమీక్ష సమావేశం.!

టెక్స్టైల్ శాఖ పై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కష్టకాలంలో నేతన్నలకు చేయూత అందించామన్నారు. రాష్ట్రంలోనే నేతన్నలకు 110 కోట్ల రూపాయలు అందాయన్నారు. చేనేత కార్మికులకు సుమారు 97 కోట్లు, పవర్లూమ్ కార్మికులకు 13 కోట్లు అందించామన్నారు. చేనేత కార్మికుల పొదుపు వాటాకి రెట్టింపు, పవర్లూమ్ కార్మికుల వాటాకు సమానంగా ప్రభుత్వం నిధులు సమకూర్చిందన్నారు. మూడు సంవత్సరాల లాకిన్ పీరియడ్ కన్నా ముందే ప్రభుత్వం నిధులు తీసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. మరోసారి "నేతన్నకు చేయూత" కార్యక్రమాన్ని ప్రారంభించాలని నేతన్నలు కోరుతున్నట్టు తెలిపారు. టెస్కో చేనేత వస్త్రాల బ్రాడింగ్ పైన ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ సంధర్భంగా గోల్కొండ హ్యండిక్రాప్ట్స్ షోరూంను సందర్శించారు. అక్టోబర్ రెండవ వారంలోగా బతుకమ్మ చీరల పంపీణి పూర్తికావాలని ఆదేశించారు.