సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు.. కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం..

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు.. కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం..

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు అన్నారు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్‌రావు.. దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటానని.. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని.. సిద్దిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇక, దుబ్బాక మహిళల త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని గుర్తుచేశారు హరీష్‌రావు.. త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన ఆయన.. దుబ్బాక నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. దుబ్బాక అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని తెలిపిన హరీష్‌రావు.. దుబ్బాక అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.35 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు.