కరోనా పరీక్షల పై తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు...!

 కరోనా పరీక్షల పై తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు...!

మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వం ఉత్తర్వులు కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెస్టులు ఎందుకు తక్కువ చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకి వలస వచ్చినవారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు చేసింది కోర్టుకు వెంటనే తెలియజేయాలని సూచించింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన టెస్టుల వివరాలను జూన్ 4 లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

అయితే ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. కరోనా పరీక్షల పై కేంద్రం రెండుసార్లు రాసిన లేఖలకు కోర్టుకు సమర్పించాలంది. లక్షణాలు లేవంటూ హై రిస్క్ ఉన్నవారికి కూడా పరీక్షలు ఎందుకు నిలిపివేశారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నరన్నది ప్రభుత్వం తెలపాలని.. ఆస్పత్రుల్లో ఉన్న కిట్లు,డాక్టర్ల పై సమగ్ర నివేదికని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.