మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌పై వేటు.. మరో ముగ్గురు అధికారులపై కూడా..!

 మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌పై వేటు.. మరో ముగ్గురు అధికారులపై కూడా..!

మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కైపోయాడు. రూ.40 లక్షలు రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు నగేష్... అయితే ఈ కేసులో 112.21ఎకరాలకు ఎన్‌వోసీ ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ రూ.కోటి 12 లక్షలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక, ఈ కేసులో.. మెదక్ అడిషనల్ కలెక్టర్‌తో పాటు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురు అధికారులపై కూడా వేటు వేసింది ప్రభుత్వం.. ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో పాటు నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది సర్కార్.. అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో అరుణారెడ్డి, తహశీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసిమ్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.