కఠిన చర్యలకు తెలంగాణ సర్కార్ సిద్దం... రోడ్డుపైకి వస్తే...
కరోనా వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ను తీసుకొచ్చారు. కానీ, చాలామంది లాక్ డౌన్ ను పక్కన పెట్టి రోడ్లపైకి బండ్లు వేసుకొని వస్తున్నారు. పాత మెడికల్ చీటీలు పట్టుకొని రోడ్లపైకి వస్తుండటంతో లాక్ డౌన్ పెట్టిన దానికి అర్ధం లేకుండా పోతున్నది. ఇప్పుడు వైరస్ ను కట్టడి చేయలేకపోతే, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అందరికీ తెలుసు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అనవసరంగా రోడ్లమీదకు వచ్చే వాహనాలపై ఫోకస్ చేసింది. గల్లీలో ఉండే వాహనాలను నెంబర్లను పోలీసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఆ వాహనం రోడ్డు ఎక్కి మూడు కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తే ఆ వాహనాన్ని సీజ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇలా చేయడం వలన వాహన దారులను కంట్రోల్ చేయవచ్చని ప్రభుత్వం చెప్తున్నది. మరి ఇది ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి. కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ ను పెంచే ప్రక్రియపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)