రైతుబంధుపై స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

రైతుబంధుపై స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

పెట్టుబ‌డి పెట్ట‌లేక ఇబ్బందులు ప‌డుతోన్న రైతుల క‌ష్టాల‌ను దృష్టిలో ఉంచుకుని.. రైతు బంధు ప‌థ‌కానికి తీసుకొచ్చారు ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు.. అయితే, కొంద‌రికి రైతు బంధు అంద‌డంలేదు.. బ్యాంకుకు సంబంధించి వివ‌రాలు స‌రిగా లేక‌పోవ‌డం.. ఇత‌ర సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో కూడా కొన్ని సార్లు ఇబ్బందులు వ‌స్తున్నాయి.. వ్య‌వ‌సాయ అధికారుల‌కు ఫిర్యాదు చేసినా కొన్నిసార్లు.. స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డంలేదు.. వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైంది తెలంగాణ ప్ర‌భుత్వం.. రైతు బంధుకు సంబంధించిన ఫిర్యాదుల కోసం గ్రేవీన్స్ సెల్  ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు వ్య‌వ‌సాయ‌శాఖ క‌మిష‌న‌ర్ జ‌నార్ధ‌న్‌రెడ్డి.. ఇప్పటి వరకు 56,94,185 మంది రైతుల ఖాతాల్లో 7,183.67 కోట్ల రూపాయాలు జ‌మ చేసిన‌ట్టు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న వ్య‌వ‌సాయ‌శాఖ క‌మిష‌న‌ర్‌..  తమ బ్యాంకు ఖాతా నంబ‌ర్ల‌ను నమోదు చేసుకొని రైతులు ఈ నెల 5వ తేదీ లోపు నమోదు చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 34,860 మంది రైతుల బ్యాంకు ఖాతా నంబ‌ర్లు స‌రిగా లేక‌పోవ‌డంతో... ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌కాలేద‌ని తెలిపారు. కాగా, ప్ర‌తీ రైతుకు రైతుబంధు ప‌థ‌కం వ‌ర్తింప‌జేస్తామ‌ని ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.