మాటకు కట్టుబడి పని చేస్తున్నాం...

మాటకు కట్టుబడి పని చేస్తున్నాం...

ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసేదే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... మహబూబాబాద్‌ పర్యటనలో ఉన్న కడియం మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్యేయం అని వెల్లడించారు. గత ప్రభుత్వాలు విద్య వ్యవస్థను పట్టించుకోలేదని ఆరోపించిన కడియం... కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం... పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయని తెలిపారు. ఆడపిల్లల ఆరోగ్యం కాపాడాలని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చదువుకుంటున్న 6 లక్షల విద్యార్థులకు, ఎదుగుతున్న ఆడపిల్లలకు ఒక్కో విద్యార్థికి రూ.1600 ఖర్చు పెట్టి హెల్త్, హైజానిక్ కిట్ ఇస్తున్నామని... ఈ కిట్స్ దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై ఎంతో ఖర్చు పడుతోందని... విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని సూచించారు డిప్యూటీ సీఎం.