టిసిఎ ఈ రోజు కొత్తగా ఎలాంటి పరువునష్టం దావా కేస్ ఫైల్ అవలేదు..

టిసిఎ ఈ రోజు కొత్తగా ఎలాంటి పరువునష్టం దావా కేస్ ఫైల్ అవలేదు..

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పై ఈ రోజు కొత్తగా ఎలాంటి పరువునష్టం దావా కేస్ ఫైల్ అవలేదు అని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి తెలిపారు. టిసిఎ పై గతంలో ,  మార్చి 7న హెచ్ సిఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్ పరువునష్టం దావా నోటీసులు పంపారు. ఈ రోజు దాని మీదనే నాంపల్లి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో టిసిఎ అడ్వొకేట్ వకాలత్ నామా ఫైల్ చేయడం జరిగింది. దీనిపై టిసిఎ వచ్చేవారం  పూర్తి స్థాయి కౌంటర్ ను కోర్టులో వేయబోతుంది. ఈ నెల 16 న జరగబోనున్న బీసీసీఐ  అపెక్స్ కౌన్సెల్ మీటింగ్ లో టిసిఎ గుర్తింపు విషయంపై చర్చ జరగనున్న నేపథ్యం లో ... ఈ విషయాన్ని ప్రచారం జరగకుండా ఆపేందుకు కుట్రపన్ని పాత కేస్ ను కొత్త కేస్ గా ప్రచారం చేసుకొని పాత్రికేయులను తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నిస్తున్నారు
  
హెచ్‌సిఎ ప్రెసిడెంట్ అజరుద్దీన్ పై ఉన్న సిబిఐ కేస్ ఇంకా సమసిపోలేదు. దానిపై పునర్విచారణ చేయాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కిషన్ రెడ్డి ని రేపు కలిసి ఫిర్యాదు చేస్తాం. అజరుద్దీన్  పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేస్ లో సీబీఐ విచారణ ఇంకా పూర్తి కాలేదు..ఛార్జ్ షీట్ ఇంకా పెండింగ్ లో ఉన్నందున గతంలో అజరుద్దీన్ పై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నాం. టిసిఎ స్థాపించినప్పటి నుండి హెచ్‌సిఎ లో జరుగుతున్న  అవకతవకలు పై ప్రశ్నిస్తూ...పోరాటం చేస్తున్నాం. కానీ... హెచ్‌సిఎ సభ్యులపై మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు అని స్పష్టం చేసారు.