తెలంగాణాలో తగ్గిన కరోనా కేసులు.. కానీ !

తెలంగాణాలో తగ్గిన కరోనా కేసులు.. కానీ !

తెలంగాణ కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 978 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 1,446 కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజాగా మరో నలుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,252కి చేరుకోగా.. ఇప్పటి వరకు 2,10,480 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, మృతుల సంఖ్య 1307 కు పెరిగింది.. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ రేటు భారత్‌ వ్యాప్తంగా 89..9 శాతంగా ఉంటే... తెలంగాణలో 91.01 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,465 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 16,430 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. అయితే శనివారం కరోనా టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గిపోయింది.. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 27,055 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 40,79,688కు పెరిగింది.